- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుతిన్ కారు నడిపిన కిమ్: బలపడుతున్న ఉత్తర కొరియా, రష్యా సంబంధాలు!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య ఇటీవల స్నేహ పూర్వక సంబంధాలు నెలకొంటున్నాయి. ఇటీవల రష్యాలో తయారైన ఓ కారును కిమ్‌కు పుతిన్ బహుమతిగా పంపారు. దీంతో తాజాగా పుతిన్ పంపిన అరస్ లిమోసిన్ అనే కారును కిమ్ నడిపారు. పలు ప్రాంతాల్లో బహిరంగంగా పర్యటించారు. కిమ్ సోదరి, కిమ్ యో జోంగ్, కిమ్‌లు ఈ కారులో ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య స్నేహం బలపడటానికి ఇదే నిదర్శనం అని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా శనివారం తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కిమ్ సోదరి ఆశాశావం వ్యక్తం చేసింది. ఆరస్ అనేది మొదటి రష్యన్ లగ్జరీ కార్ బ్రాండ్. 2018 లో తన ప్రారంభోత్సవ వేడుకలో పుతిన్ మొదటిసారి ఆరస్ లిమోసిన్‌ను ఉపయోగించారు. కాగా, గతేడాది కిమ్ రష్యాలో పర్యటించి, పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.అప్పటి నుంచి ఉత్తర కొరియా, రష్యాలు తమ సైనిక, ఇతర సహకారాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా రష్యాకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు రాగా వాటిని కిమ్ ఖండించారు. మరోవైపు నిషేధిత బాలిస్టిక్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించగా.. రష్యా, చైనాలు అడ్డుకున్నాయి.