జననాల రేటు పెంచేందుకు జపాన్ దేశం వినూత్న ప్రయోగం!

by Ramesh Goud |
జననాల రేటు పెంచేందుకు జపాన్ దేశం వినూత్న ప్రయోగం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జపాన్ లో జననాల రేటు కనిష్ట స్థాయికి పడిపోవడంతో టోక్యో ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. దేశ వ్యాప్తంగా వివాహ రేటును పేంచేందుకు ప్రభుత్వ డేటింగ్ ను పరిచయం చేయనుంది. మరణాల రేటుతో పోలిస్తే.. జననాల రేటు తక్కువగా నమోదు అవుతుండటంతో ఆందోళన చెందిన జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 123.9 మిలియన్ల జనాభా గల దేశంలో గత సంవత్సరం కేవలం 7,27,277 జననాలు మాత్రమే నమోదు అయ్యాయని ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వైవాహిక సంఘాలు కూడా క్షీణత, విడాకుల పెరుగుదలతో గత సంవత్సరం 30,000 వివాహాలు గణనీయంగా తగ్గాయి. దేశం యొక్క జనాభా అసమతుల్యత కారణంగా ఈ క్షీణత దశాబ్దాలుగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ సవాళ్లను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది. చైల్డ్ కేర్ సౌకర్యాల విస్తరణ, తల్లిదండ్రులకు గృహ రాయితీలు, ఎంపిక చేసిన ప్రాంతాలలో, దంపతులకు పిల్లలను కనేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు వంటి కార్యక్రమాలు చేస్తోంది. ప్రభుత్వం నిర్వహించే డేటింగ్ యాప్. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలో ఉంది. ఈ యాప్ పెళ్లిని కోరుకునే వ్యక్తుల మధ్య కనెక్షన్‌లను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పెళ్లికి "మొదటి అడుగు"గా వర్ణించబడిన ఈ యాప్ టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం అందించిన AI మ్యాచ్ మేకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.

భాగస్వామిలో కావలసిన లక్షణాలను పేర్కొనే ఎంపికతో, అనుకూలతను నిర్ధారించడానికి వినియోగదారులు "విలువల విశ్లేషణ పరీక్ష" చేయించుకోవాల్సి ఉంటుంది. డేటింగ్ యాప్ వైవాహిక బంధాలను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పడంతో పాటు వివాహాన్ని కోరుకునే వ్యక్తులను తొలి అడుగు వేయమని ప్రోత్సహిస్తుంది. ఈ యాప్ లో రజిస్టర్ చేసుకునేందుకు అర్హత ప్రమాణాలకు పెట్టింది. యాప్ వినియోగదారులు ఒంటరిగా ఉండి.. 18 ఏళ్లు పైబడి, టోక్యోలో నివాసముంటున్న లేదా పని చేస్తూ ఉండాలని పేర్కొంది. ఇంకా, యాప్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్, చైల్డ్ కేర్ మరియు హౌసింగ్ అసిస్టెన్స్‌పై మార్గదర్శకత్వంతో పాటుగా గృహ బాధ్యతలు, కెరీర్ కౌన్సెలింగ్‌లో పురుషుల ప్రమేయాన్ని ప్రోత్సహించడంతో పాటు అదనపు సహాయక చర్యలను ప్రోత్సహిస్తుంది.

Advertisement

Next Story