- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షల రూపాయల ఖర్చు పెట్టి కుక్కలా మారాడు.. ఎక్కడో తెలుసా? (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: పెంపుడు జంతువులంటే కొందరు చాలా ఇష్టపడుతుంటారు. వాటి కోసం ఎంతైనా ఖర్చ పెడుతుంటారు. కానీ ఓ వ్యక్తి కుక్క మీద ఉండే అభిమానంతో ఏకంగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుక్కలా మారాడు. వింతగా అనిపించినా ఈ ఘటన నిజంగానే జపాన్ లో జరిగింది. వివారల్లోకి వెళ్తే.. జపాన్ కు చెందిన టోకో అనే వ్యక్తి కుక్కలా మారాలనుకున్నాడు. అయితే బయాలాజికల్ గా అందుకు సాధ్యం కాకపోడంతో కాస్ట్యూమ్ డిజైనర్స్ ను సంప్రదించాడు. దీంతో 40 రోజులు కష్టపడి అచ్ఛం కుక్కలా ఉండే ఓ కాస్ట్యూమ్ ను టోకో కోసం సిద్ధం చేసింది ఆ కాస్ట్యూమ్ సంస్థ. ఇందుకు అతడి నుంచి అక్షరాల 12 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇక ఆ కాస్ట్యూమ్ ధరించి టోకో మొదటిసారి తన అసిస్టెంట్ సహాయంతో వీధుల్లో తిరిగాడు.
ఈ నేపథ్యంలోనే కుక్కనుకొని అతడి వద్దకు నిజమైన కుక్కలు కూడా వచ్చాయి. అచ్ఛం కుక్కలా ఉన్న టోకోను ఎవరూ కూడా మనిషి అని గుర్తించలేకపోయారు. అయితే కుక్క గెటప్ లో ఉన్న అతడు మాట్లాడుతుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడితో సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టారు. కుక్కలా మారాలన్న టోకో గురించి తెలుసుకొని ప్రశంసిస్తున్నారు. కాగా కుక్క గెటప్ లో తిరిగిన దాదాపు 5 నిమిషాల వీడియోను టోకో తన యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశాడు. దీంతో టోకోపై ప్రశంసలు కురిపిస్తున్నారు అతడి సబ్ స్క్రైబర్లు.