ఈదురుగాలుల ధాటికి జపాన్‌ మూన్ మిషన్ ప్రయోగం వాయిదా!

by Vinod kumar |
ఈదురుగాలుల ధాటికి జపాన్‌ మూన్ మిషన్ ప్రయోగం వాయిదా!
X

టోక్యో : జాబిల్లిపై ల్యాండింగ్ లక్ష్యంగా జపాన్ సోమవారం నిర్వహించాల్సిన మూన్ మిషన్ ప్రయోగం వాయిదా పడింది. ఇందుకోసం ‘హెచ్‌-2ఏ’ రాకెట్‌ను రెడీ చేసినప్పటికీ.. లాంచ్ ప్యాడ్ పరిసరాలలో ఈదురుగాలులు వీస్తుండటంతో తాత్కాలికంగా ప్రయోగాన్ని ఆపేశారు. మూన్ మిషన్‌కు నిర్ధారించిన టైంకు మరో 27 నిమిషాలు ఉందనగా.. దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ లాంచ్ ప్యాడ్ దగ్గర 5,000-15,000 మీటర్ల ఎత్తులో గాలి వేగం గంటకు 108 కిలోమీటర్లుగా నమోదైందని వాతావరణ నిపుణుల నుంచి సమాచారం అందడంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని ఆపడమే మంచిదని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 15 తర్వాతే మళ్లీ ప్రయోగం నిర్వహించే అవకాశం ఉందని జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. జపాన్ మూన్ మిషన్‌లోని ల్యాండర్ పేరు.. స్లిమ్‌ (స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌).

Advertisement

Next Story

Most Viewed