బాయ్ ఫ్రెండ్‌తో ప్రధానికి బ్రేకప్.. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా క్లారిటీ..!

by Satheesh |   ( Updated:2023-10-20 10:41:55.0  )
బాయ్ ఫ్రెండ్‌తో ప్రధానికి బ్రేకప్.. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా క్లారిటీ..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన బాయ్ ఫ్రెండ్ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన ఆండ్రియా జియాంబ్రూనోతో నా సంబంధం ఇక్కడితో ముగుస్తుంది" అని పేర్కొన్నారు. మా మార్గాలు గత కొంతకాలంగా వేర్వేరుగా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయమంటూ రాసుకొచ్చారు. కాగా, వీరికి ఏడేళ్ల కూతురు ఉంది. వీరు విడిపోవడానికి కారణం భర్త టీవీ షోల్లో మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆండ్రియాతో త‌న రిలేష‌న్‌ను బ్రేక్ చేస్తున్నట్లు ప్రధాని మెలోని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed