- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇజ్రాయెల్ సైనికుల అరాచకం.. 104 మంది మృతి, 700 మందికి గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆర్మీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పెద్దఎత్తున వచ్చిన నిత్యావసరాల పంపిణీ కోసం గాజాలో ఓ చోట ఏర్పాటుచేసిన సహాయక కేంద్రం వద్ద గుమిగూడిన ప్రజలను కూడా ఇజ్రాయెల్ ఆర్మీ వదల్లేదు. ఆకలితో అలమటిస్తూ.. నిత్యావసరాల కోసం క్యూ కట్టిన వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుంది. సామాన్య ప్రజల గుంపుపై ఇజ్రాయెల్ సైనికులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 104 మంది సామాన్య పౌరులు చనిపోగా, 700 మందికిపైగా గాయపడ్డారు. ఈ అమానవీయ ఘటన గురువారం తెల్లవారుజామున ఉత్తర గాజా ప్రాంతంలో జరిగిందని గుర్తించారు. మానవతా సహాయంతో వచ్చిన ట్రక్కును ఒక్కసారిగా గాజా ప్రజలు చుట్టుముట్టడంతో.. లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకే సమీపంలో పహారా కాస్తున్న తమ సైనికులు కాల్పులు జరిపారని ఇజ్రాయెలీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది.