EC: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కీలక ప్రకటన.. ఓటర్ల తుది జాబితాపై క్లారిటీ

by Gantepaka Srikanth |
EC: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కీలక ప్రకటన.. ఓటర్ల తుది జాబితాపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటర్ల తుది జాబితా(Final list of voters)పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(Telangana Chief Electoral Officer) సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా(Draft List of Voters)ను ప్రకటించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. 8 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. 4.14 లక్షల ఓటర్లను తొలగించాము. యువ ఓటర్లు 4,73,838 మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

మొత్తం తెలంగాణలో 551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఓటర్ జాబిత(Voter list)పై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తామని అన్నారు. జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈనెల 9,10 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. బీఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(Teachers MLC)ల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed