- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Attack: కర్నూలు జిల్లాలో ఘోరం.. పెళ్లి చేయడం లేదని తండ్రిని చితకబాదిన కొడుకులు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేయడం లేదని కన్నతండ్రిపై కొడుకులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా (Kurnool District)లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా (Kurnool District) గోనెంగండ్ల (Gonengandla) మండల కేంద్రానికి చెందిన మంత రాజు (65) కిరాణ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, అందులో కేవలం పెద్ద కూతురికి మాత్రమే వివాహం జరిగింది. మిగతా ముగ్గురు పిల్లలు ఇంట్లోనే వివాహం కాకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే 40 ఏళ్లు దాటినా తమకు వివాహం చేయలేదంటూ.. కుమారులు నీలకంఠ, జగదీశ్ తండ్రి మంత రాజును కట్టెలతో విచక్షణారహితంగా చితకబాదారు. అయితే, రాజు అరుపులు విన్న స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story