Ram Charan: సరికొత్త రికార్డు సృష్టించబోతున్న రామ్ చరణ్.. ‘గేమ్ చేంజర్‌’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ ఎక్కడ జరగనుందంటే? (ట్వీట్)

by Hamsa |   ( Updated:2024-11-23 12:46:29.0  )
Ram Charan: సరికొత్త రికార్డు సృష్టించబోతున్న రామ్ చరణ్.. ‘గేమ్ చేంజర్‌’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ ఎక్కడ జరగనుందంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. తమన్(Thaman) మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ‘గేమ్ చేంజర్’(Game Changer) సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘గేమ్ చేంజర్’ టీజర్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ వ్యూస్‌ను రాబట్టి యూట్యూబ్‌ను షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌(Pre-release event)ను డేట్ ఫిక్స్ అయినట్లు మేకర్స్ ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇండియాలో కాకుండా అమెరికా(America)లోని కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్‌లో నిర్వహించ‌బోతున్నట్లు ప్రక‌టించారు. అయితే మొట్టమొద‌టి సారిగా ఒక ఇండియ‌న్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక‌ను అమెరికాలో నిర్వహించ‌బోతుండటం విశేషం. అయితే ఈ చిత్రంతో రామ్ చరణ్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More...

Ram Charan: ‘RC16’ లో స్టార్ నటుడు.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్ (ట్వీట్)


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed