Israel: లెబనాన్‌పై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. టైర్ నగరంలోని శరణార్థి శిబిరంపై అటాక్

by vinod kumar |   ( Updated:2024-09-30 11:53:01.0  )
Israel: లెబనాన్‌పై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. టైర్ నగరంలోని శరణార్థి శిబిరంపై అటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొన్ని రోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున టైర్ నగరంలోని పాలస్తీనా శరణార్థుల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో తమ సీనియర్ నేత ఒకరు మరణించినట్టు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ తెలిపింది. ఆయనను ఫతే షెరీఫ్ అబూ ఎల్-అమీన్‌గా గుర్తించారు. అంతేగాక అతని భార్య, ఇద్దరు పిల్లలు సైతం ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. మరో ముగ్గురు ఉగ్రవాదులు సైతం ఈ ఘటనలో మృతి చెందారు. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై ఇంకా దాడిని కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో 1000 మంది మరణించగా, 6000 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 2,50,000 మంది నిరాశ్రయులైనట్టు పర్యావరణ మంత్రి నాజర్ యాసిన్ తెలిపారు.

Advertisement

Next Story