Middle East: మరొక హిజ్బుల్లా కమాండర్‌ను చంపిన ఇజ్రాయెల్

by Harish |
Middle East: మరొక హిజ్బుల్లా కమాండర్‌ను చంపిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో కాల్పలు విరమణ చేపట్టాలని అమెరికా పిలుపునిచ్చినప్పటికి వాటిని పట్టించుకోకుండా ఇజ్రాయెల్ లెబనాన్‌లోని ప్రధాన పట్టాణాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ప్రధాన కమాండర్లను హతమార్చిన దళాలు, తాజాగా మరొక హిజ్బుల్లా కమాండర్‌ను చంపాయి. హిజ్బుల్లా డ్రోన్ విభాగం కమాండర్ అయిన ముహమ్మద్ హుస్సేన్ స్రోర్‌ను ఇజ్రాయెల్ మిలిటరీ చంపింది. బీరుట్‌లోని ఒక అపార్ట్‌మెంట్ భవనంపై వైమానిక దాడి చేయగా, దానిలో ఉన్న ముహమ్మద్ హుస్సేన్ మరణించాడు. నివేదికల ప్రకారం, 1973లో జన్మించిన ఆయన, దేశంలోని హుతీ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇవ్వడానికి యెమెన్‌కు హిజ్బుల్లా పంపిన అనేక మంది అగ్ర సలహాదారులలో ఒకరు. అయితే కమాండర్ మృతి వార్తలపై హిజ్బుల్లా గ్రూప్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం అమెరికా, ఫ్రాన్స్, ఇతర మిత్రదేశాల 21 రోజుల సంధి ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ , ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్, కీలకమైన గల్ఫ్ అరబ్ దేశాలు లెబనాన్‌లో పరిస్థితి తట్టుకోలేని విధంగా ఉంది. ఈ యుద్ధాన్ని ముగించాలని ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అయినప్పటికి కూడా ఇజ్రాయెల్ వాటన్నింటిని పట్టించుకోకుండా లెబనాన్‌పై విరుచుకుపడుతూనే ఉంది. లెబనాన్ చుట్టుపక్కల ఉన్న హిజ్బుల్లా బలగాలపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఈ వారంలో 700 మందికి పైగా మరణించారు. సుమారు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed