Israel - Hezbollah War : హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు..!

by Maddikunta Saikiran |
Israel - Hezbollah War : హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్ కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. సోమవారం సాయంత్రం లెబనాన్‌లోని తూర్పు బెకా వ్యాలీలోని హిజ్బుల్లా ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.ఈ దాడి వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రెండు భద్రతా వర్గాలు రాయిటర్స్‌కి తెలిపాయి. ఈ దాడిలో 8 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన ఎనిమిది మందిలో ఆరుగురు లెబనీస్ పౌరులు మరియు ఇద్దరు సిరియన్ పిల్లలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లెబనాన్‌లోని బెకా ప్రాంతంలోని హిజ్బుల్లా ఆయుధ నిల్వ ఉన్న కేంద్రాలపై తమ వైమానిక దళం దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనాన్‌కు దక్షిణంగా ఉన్న డీర్ కనౌన్ ,తైబేల లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న సీనియర్ మిలిటెంట్‌ అధికారిని అలాగే హిజ్బుల్లా సైనిక నిర్మాణం నుండి పనిచేస్తున్న సెల్‌ను కాగా ఈ రాకెట్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

అయితే గత శనివారంఇజ్రాయెల్ సైన్యం లెబనీస్ సాయుధ గ్రూప్ హిజ్బుల్లా మిలిటెంట్ల ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా దాదాపుగా 10 మంది మరణించారు.ఇదేగాక గత జూలైలో దక్షిణ లెబనాన్‌లోని అడ్‌లౌన్ పట్టణంలో ఇరాన్ మద్దతిస్తున్న ఓ గ్రూప్ కు మందుగుండు సామగ్రిని నిల్వ చేసే మరొక డిపోను కూడా ఇజ్రాయెల్ సైన్యాలు లక్ష్యంగా చేసుకున్నాయని మూడు భద్రతా వర్గాలు రాయిటర్స్‌తో తెలిపాయి. రాయిటర్స్ టోల్ ప్రకారం.. గత సంవత్సరం ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి లెబనాన్‌లో 416 మంది హిజ్బుల్లా యోధులు 132 మంది పౌరులతో సహా 622 మంది మరణించారు.

Next Story

Most Viewed