Telecom Sector: టారిఫ్ పెంపుతో భారీగా కష్టమర్లను కోల్పోయిన ప్రైవేట్ టెలికాం కంపెనీలు

by S Gopi |
Telecom Sector: టారిఫ్ పెంపుతో భారీగా కష్టమర్లను కోల్పోయిన ప్రైవేట్ టెలికాం కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచాయి. జూలై మొదటి వారంలో ఈ కంపెనీలు తమ మొబైల్ సర్వీస్ ప్లాన్ రేట్లను 10-27 శాతం హైక్ చేశాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా గత 2-3 ఏళ్లుగా ఉన్న ఎంట్రీ-లెవల్ మొబైల్ ప్లాన్‌లను ఏకంగా రెండింతలు చేసి రూ. 199కి పెంచాయి. దీంతో ధరల పెంపును ఇష్టపడని వినియోగదారులు టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చారు. ఫలితంగా ఈ ఏడాది జూలైలో రిలయన్స్ జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఎక్కువ మంది కస్టమర్లను పెంచుకుంది. శుక్రవారం విడుదలైన టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డేటా ప్రకారం.. సమీక్షించిన నెలలో బీఎస్ఎన్ఎల్ కొత్తగా 29.4 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్, 16.9 లక్షల అందిని కోల్పోగా, వొడాఫోన్ ఐడియా 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకున్నాయి.

Advertisement

Next Story