ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్‌.. కారణం ఇదే

by Hajipasha |
ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్‌.. కారణం ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం హైఅలర్ట్‌ ఉంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్‌లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేయొచ్చనే ప్రచారం మొదలైంది. ఈనేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్మీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ దేశంలోని జీపీఎస్ నావిగేషన్ సేవలను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. లక్ష్య స్థానం వైపుగా వెళ్లకుండా ఇరాన్‌కు చెందిన గైడెడ్ క్షిపణులు, డ్రోన్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేశారని తెలిసింది. ఇక ఇజ్రాయెల్ సైనిక విభాగాలకు సెలవులను రద్దు చేసింది. వాయుసేనను పెద్దఎత్తున దేశవ్యాప్తంగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ప్రజల కోసం సురక్షితమైన పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారని సమాచారం. ఈ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్‌లోని కొన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఖాళీ అయ్యాయని సమాచారం.

Advertisement

Next Story