బైడెన్, ట్రంప్, హారిస్‌ల యొక్క ఈ - మెయిల్స్ హ్యాక్ చేయడానికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌ గ్రూప్ ప్రయత్నం : Google

by Maddikunta Saikiran |
బైడెన్, ట్రంప్, హారిస్‌ల యొక్క  ఈ - మెయిల్స్ హ్యాక్ చేయడానికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌ గ్రూప్ ప్రయత్నం : Google
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇరాన్ దేశం యొక్క రివల్యూషనరీ గార్డ్‌ గ్రూప్ గత మే నుండి బైడెన్, ట్రంప్, హారిస్‌ల వ్యక్తిగత ఈ-మెయిల్స్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ తెలిపింది . బుధవారం గూగుల్ టెక్ కంపెనీ ఇంటెలిజెన్స్ విభాగం మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడైన బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను రివల్యూషనరీ గార్డ్‌ గ్రూప్ లక్ష్యంగా చేసుకుంటోందని , ఈ గ్రూప్ లక్ష్యంగా చేసుకున్న వారిలో ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు, అలాగే అధ్యక్ష ఎన్నికల ప్రచార అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని గూగుల్ టెక్ కంపెనీ పేర్కొంది.

ఈ మేరకు గూగుల్ కంపెనీ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన చీఫ్ అనలిస్ట్ జాన్ హల్ట్‌క్విస్ట్ మాట్లాడుతూ.. "గూగుల్ కంపెనీ ఈ దాడులకు సంబంధించిన అనుమానిత మెయిల్స్ ను Gmail పాప్‌అప్‌లో పంపుతుందని, ఈ గ్రూప్ ప్రభుత్వ మద్దతున్న ప్రతి వ్యక్తి యొక్క ఇమెయిల్ పై దాడి చేసి వారి పాస్‌వర్డ్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు Gmail పాప్‌అప్‌ హెచ్చరిస్తుందని జాన్ హల్ట్‌క్విస్ట్ తెలిపారు. అలాగే ఈ రివల్యూషనరీ గార్డ్‌ గ్రూప్ US ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని, 2020 సంవత్సరం జూన్ లో కూడా బైడెన్ , ట్రంప్ కు చెందిన ప్రచార బృందాలను లక్ష్యంగా చేసుకుందని" జాన్ హల్ట్‌క్విస్ట్ వెల్లడించారు. అలాగే ఈ గ్రూప్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు, సైనిక అనుబంధ సంస్థల ఈ- మెయిల్స్ ను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం.కాగా గత శనివారం ట్రంప్ ప్రచార బృందం తమ ఈ - మెయిల్స్ హ్యాక్ ఇరాన్ పనేనని వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story