- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. ఏ క్షణంలోనైనా దాడి!
దిశ, నేషపల్ బ్యూరో: మిడిల్ఈస్ట్‌లో పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి.ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమవుతున్న తరుణంలో దీనిని ఎలాగైనా ఆపాలని ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండోలు శనివారం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌కు సంబంధించిన కంటైనర్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఈ దాడిని ముందుగా పేర్కొంది. ఒక రక్షణాధికారి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, కనీసం ముగ్గురు వ్యక్తులు హెలికాప్టర్ నుండి కంటైనర్ షిప్‌గా కనిపించిన వాటిపైకి వేగంగా రోపింగ్ చేస్తున్న ఫుటేజీని గమనించినట్లు తెలిపారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లు గతంలో కూడా ఇలాంటి ఓడ దాడులను నిర్వహించారని అన్నారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ ప్రాంతంలో సంఘర్షణను మరింత కఠినం చేయడం వల్ల ఇరాన్ తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ సైన్యం శనివారం హెచ్చరించింది. ఈ షిప్ ఇజ్రాయెలీ బిలియనీర్ ఇయల్ ఆఫర్‌కు చెందిన జోడియాక్ గ్రూప్‌లో భాగమైన లండన్-ఆధారిత జోడియాక్ మారిటైమ్‌ది. ఇది చివరిసారిగా శుక్రవారం దుబాయ్ నుండి హార్ముజ్ జలసంధి వైపుగా ప్రయాణించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి యుద్ధ సన్నాహాలు చేస్తుంది. అది ఏక్షణమైన దాడి చేసే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.