Indonesia: పడవ బోల్తా.. 15 మంది దుర్మరణం

by Vinod kumar |   ( Updated:2023-07-24 11:28:12.0  )
Indonesia: పడవ బోల్తా.. 15 మంది దుర్మరణం
X

జకార్తా: ప్రయాణికులతో ఓవర్ లోడ్ అయిన పడవ మార్గ మధ్యలో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 50 మందిలో 15 మంది చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో చోటుచేసుకుంది. ఈ పడవ ఆగ్నేయ సులవెసి ప్రావిన్స్‌లోని లాంటో గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చెక్కతో చేసిన ఈ పడవలో కేవలం 20 మంది ప్రయాణించే వీలుంది. కానీ 50 మందిని పడవలోకి ఎక్కించుకోవడంతో అది బ్యాలెన్స్ కోల్పోయింది. పడవ బోల్తా పడగానే 27 మంది ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరో ఆరుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

Read More: Viral Video : వీడియో కోసం వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు (వీడియో)

Advertisement

Next Story