- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్ అమెరికాను బలహీనంగా చూస్తుంది: నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోందని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, వ్యూహాత్మకంగా రష్యాతో సన్నిహితంగా ఉందని చెప్పారు.భారత ప్రధాని మోడీతో కూడా మాట్లాడానని, యూఎస్‌తో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని కానీ అమెరికన్ల నాయకత్వంపై వారికి విశ్వాసం లేదన్నారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌కు అమెరికాపై నమ్మకం లేదు. ప్రస్తుతం యూఎస్ బలహీనంగా ఉందని వారు భావిస్తున్నారు. ఎల్లప్పుడూ భారత్ తెలివిగా వ్యవహరిస్తోంది. రష్యాతోనూ సన్నిహితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వారు తమకు కావాల్సిన సైనిక సామగ్రిని పొందుతారు’ అని చెప్పారు. చైనాపై తక్కువ ఆధారపడటానికి జపాన్ తమకు బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందజేసిందని తెలిపారు. అమెరికా తన భాగస్వాములతో మంచి సంబంధాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తమ మిత్ర దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా కలిసి వస్తాయన్నారు. చైనా ఆర్థికంగా క్షీణించిందని అందుకే అమెరికాతో యుద్ధానికి సిద్దమవుతోందని వెల్లడించారు.