Australia Student Visa: ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!

by Maddikunta Saikiran |
Australia Student Visa: ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే 2025 సంవత్సరం నుండి అంతర్జాతీయ విద్యార్థుల వీసాల సంఖ్యను 2.7 లక్షలకు పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్లే వారిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఆస్ట్రేలియాకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడ అద్దె ఇళ్లుల కిరాయిలు విపరీతంగా పెరిగాయి. ఈ మేరకు తమ దేశానికి వలస వచ్చేవారి సంఖ్యను తగ్గించాడనికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లేర్ తాజాగా వెల్లడించారు.

కాగా జూన్ 2022లో ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ విద్యార్ధి వీసాల సంఖ్యను 5.10 లక్షలకు పరిమితం చేయగా, 2023లో ఈ సంఖ్య 3.75 లక్షలకు తగ్గించింది. 2025 ఫిబ్రవరి ఇన్‌టేక్ కోసం అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న విద్యార్థులను ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుందని , ముఖ్యంగాపంజాబ్ విద్యార్థులు ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయే ప్రమాదముందని ఆస్ట్రేలియా మైగ్రేషన్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ అథారిటీ సభ్యుడు సునీల్ జగ్గీ చెప్పారు. ఆస్ట్రేలియాలో నర్సింగ్ చదవాలనుకుంటున్న హర్యానాకు చెందిన ఒక విద్యార్థి మాట్లాడూతూ.. ఈ నిర్ణయం నా కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కావడంతో నా కుటుంబం నా చదువు కోసం చాలా అప్పులు తీసుకుందని,ఒకవేల నాకు వీసా అప్రూవ్ కాకుంటే నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడే అవకాశముందని అతను తెలిపాడు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత దేశం నుండి సుమారు 1.22 లక్షల మంది విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. కెనడా, US , UK తర్వాత ఆస్ట్రేలియాలో చదుకోవడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed