- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sheikh Hasina: షేక్ హసీనాపై ఒత్తిడి తీసుకురావద్దని అమెరికాకు భారత్ సూచన
దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్ల నేపథ్యంలో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని భారత్ అమెరికాను కోరినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఇటీవల జనవరిలో ఎన్నికలకు ముందు వేలాది మంది ప్రత్యర్థులు, విమర్శకులను జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు హసీనాను బహిరంగంగా విమర్శించారు. అలాగే అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు చెందిన ఒక పోలీసు యూనిట్‌పై ఆంక్షలు విధించింది. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన లేదా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన బంగ్లాదేశీయులపై వీసా ఆంక్షలు విధిస్తామని కూడా అగ్రరాజ్యం బెదిరించింది.
దీంతో ప్రస్తుతం ఇండియాలో ఉన్న హసీనాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత అధికారులు హసీనాపై విమర్శలు తగ్గించుకోవాలని సూచించగా, ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం హసీనా ప్రభుత్వంపై తన విమర్శలను గణనీయంగా తగ్గించిందని వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదికలో వెల్లడైంది. అయితే అమెరికా అధికారులు మరో ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం, షేక్ హసీనాపై విమర్శలు తగ్గించింది భారత్ జోక్యం వల్ల కాదని, ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.