Rishi Sunak తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. వాణిజ్య ఒప్పందంపై చర్చ

by Harish |   ( Updated:2022-10-28 02:35:14.0  )
Rishi Sunak తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. వాణిజ్య ఒప్పందంపై చర్చ
X

న్యూఢిల్లీ: యూకే నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌తో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో ముగించాల్సిన అవసరం గురించి ప్రధానులు ఇద్దరూ చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

'రిషి సునాక్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపాను. మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తాము. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ముందస్తు ముగింపు ప్రాముఖ్యతపై కూడా మేము అంగీకరించాము' అని పేర్కొన్నారు.

మోడీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ రిషి సునాక్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్య బంధాల విషయంలో మరింత లోతుకు ఇరు ప్రజాస్వామ్యాలు చేరుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడటం ఇదే తొలిసారి.

Advertisement

Next Story