- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలి: ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు ఉధృతమయ్యాయి. తాజాగా ఆదివారం సెంట్రల్ జెరూసలెంలో సుమారు పదివేల మందికి పైగా ఇజ్రాయెలీలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హమాస్ నుంచి బంధీలను విడిపించడంలో నెతన్యాహు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, బంధీలను విడుదల చేయడానికి ప్రయత్నించాలని వాడు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద నిరసనలు కావడం గమనార్హం. అంతకుముందు టెల్ అవీవ్, జెరూసలెంలో ప్రజలు నిరసన చేపట్టగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
అక్టోబర్ 7నాటి వైఫల్యానికి నెతన్యాహు కారణమని ఇజ్రాయెలీ ఆందోళన కారులు ఆరోపించారు. గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ఉన్న బందీలను విడిపించేందుకు వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవాలని, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణ కారణంగా అత్యంత ముఖ్యమైన మిత్రదేశమైన అమెరికాతో సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలపై కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరించినట్టుగా స్పష్టమవుతోందని, కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.‘ఈ ప్రభుత్వంతో బందీలు ఎవరూ తిరిగి రారని మేము నమ్ముతున్నాము ఎందుకంటే వారు బందీల విడుదల కోసం జరిగే చర్చలను బహిష్కరిస్తున్నారు’ అని ఓ నిరసన కారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది అక్టోబర్ 7న దాడి అనంతరం 250 మందిని హమాస్ బంధీలుగా చేసుకోగా..నవంబర్‌లో కాల్పుల విరమణ సమయంలో గాజాలో దాదాపు సగం మంది బంధీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా 130 మందికి పైగా బంధీలు మిలిటెంట్ల వద్ద ఉన్నారు. అయితే వారిని ఇజ్రాయెల్‌కు తీసుకురావడానికి అంతర్జాతీయంగా మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనిపై తాజాగా ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరిగినప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ సైతం గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిచ్చారు.