I'M BACK: మళ్లీ సోషల్ మీడియాలోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

by Harish |   ( Updated:2023-05-20 15:24:54.0  )
IM BACK: మళ్లీ సోషల్ మీడియాలోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు సంవత్సరాల పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి నిషేధం ఎదుర్కొన్న తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తన మొదటి ఫేస్‌బుక్ పోస్ట్‌ను షేర్ చేశారు. "నేను తిరిగి వచ్చాను(I'M BACK)," అని 12 సెకన్ల వీడియోతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాన్ని మొదటి 12 సెకన్లు ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. జనవరి 6, 2021, క్యాపిటల్ అల్లర్ల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ట్రంప్ ఖాతాలను మెటా యాజమాన్యం సస్పెండ్ చేసింది. తర్వాత దీనిని అధికారికంగా రెండేళ్లపాటు పొడిగించారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఫిబ్రవరిలో, మెటా యాజమాన్యం ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించింది. అంతకు ముందు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్వట్టర్ కూడా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేసింది.

Advertisement

Next Story