- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆషాఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి..అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దిశ,వెబ్‌డెస్క్:ఆషాఢంలో పెళ్లిలకు మూఢం అని తెలుగు వాళ్లు నమ్ముతారు. ఈ క్రమంలో ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళకు, ఇతర శుభకార్యాలకు మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఆషాఢంలో హిందువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. అవసరమైతే కొన్ని నెలలపాటు వాయిదా వేస్తారు కానీ, ఈ ఆషాఢంలో మాత్రం భాజాభజంత్రీలు మోగించరు అనే విషయం తెలిసిందే. అలాగే కొత్త కోడలు అత్తారింట్లో ఉండదు. ఈ ఆచారం కూడా చాలా రోజుల నుంచే కొనసాగుతుంది.. అయితే ఈ సమయంలోనే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి ఘనంగా జరుగుతోంది. అయితే కొందరికి ఈ వివాహ విషయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆషాఢం కదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి ముహుర్తాన్ని దృక్‌గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణాదిలో చంద్రుడి కదలికలు, ఉత్తరాధిలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందిస్తున్నారు. అందుకే ఆషాఢంతో సంబంధం లేకుండా నేడు శుభముహూర్తంలో పెళ్లి జరిపిస్తున్నారు. పంచాంగం ప్రకారం కూడా ఈ రోజు మంచిదని పలువురు పండితులు చెబుతున్నారు.