Human Remains From Titan: 'టైటాన్' శకలాల్లో మానవ అవశేషాలు.. టైటాన్ బ్లాస్టింగ్ ఘటనలో కీలక పరిణామం

by Mahesh |   ( Updated:2023-06-29 06:33:00.0  )
Human Remains From Titan: టైటాన్ శకలాల్లో మానవ అవశేషాలు.. టైటాన్ బ్లాస్టింగ్ ఘటనలో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన మినీ జలాంతర్గామి ‘టైటాన్’ శకలాలను తీరానికి తీసుకువచ్చారు. కెనడాలోని న్యూఫాండ్ ల్యాండ్ అండ్ లాబ్రాడార్ ప్రావిన్సులోని సెయింట్ జాన్స్ ఓడరేవుకు వీటిని తీసుకొచ్చినట్లు అమెరికా కోస్టుగార్డు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మానవ అవశేషాలుగా అనుమానిస్తున్న భాగాలను నిపుణలు సేకరించారు. ఈ అవశేషాలను అమెరికాకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషించనున్నారని అధికారులు వెల్లడించారు. టైటానిక్ నౌక శకలాల కోసం సముద్రయానానికి జూన్ 18న బయలుదేరిన ఓషన్ గేట్ సంస్థకు చెందిన టైటాన్ మినీ సబ్ మెరైన్ సముద్రంలో అధిక పీడనం వల్ల పేలిపోయింది. ఈ ప్రమాదంలో టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story