- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Houthi: వాణిజ్య నౌకలపై దాడులు మొదలుపెట్టిన హూతీ తిరుగుబాటుదారులు
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు తిరిగి వాణిజ్య నౌకలపై దాడులు మొదలుపెట్టారు. శనివారం దక్షిణ యెమెన్‌లోని అడెన్‌కు తూర్పున 125 నాటికల్ మైళ్ల దూరంలో ఒక నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు బ్రిటన్ సముద్ర ఏజెన్సీ నివేదించింది. అయితే ఈ ఘటనలో నౌకలో చిన్న అగ్నిప్రమాదం సంభవించగా అందులో ఉన్న వారు దానిని ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అలాగే, హూతీలు ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి (LACM) ని ప్రయోగించగా, దానిని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా మిలిటరీ పేర్కొంది.
గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నట్టు కనపించిన హూతీ తిరుగుబాటుదారులు, హమాస్ చీఫ్ హనియా హత్యతో ప్రతీకారంగా వాణిజ్య నౌకలపై దాడులు చేయడం మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌పైకి ఇరాన్, హిజ్బుల్లా గ్రూపు ప్రత్యక్ష దాడులు చేస్తున్న తరుణంలో ఇప్పుడు వారికి మద్దతుగా హూతీలు కూడా దాడులు చేయడం మొదలుపెట్టడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.
అంతర్జాతీయ జలాలను సురక్షితంగా ఉంచడానికి, నావిగేషన్ స్వేచ్ఛను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు ప్రకటించారు. గత ఏడాది అక్టోబరులో ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య జరిగిన దాడి తర్వాత ఇరాన్-మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని నౌకలను లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లతో దాడులను ప్రారంభించారు.