'House of Mirrors':బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి బయటకొస్తున్న సంచలనాలు

by Shamantha N |
House of Mirrors:బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి బయటకొస్తున్న సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) గురించి సంచలనాలు బయటకొచ్చాయి. ఆమెపై ప్రస్తుత బంగ్లా (Bangladesh) ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారిని ‘హౌస్‌ ఆఫ్‌ మిర్రర్‌’గా పిలిచే చీకటి జైళ్లలో బంధించారనే ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరు చనిపోగా.. వందలాది మంది కనిపించకుండా పోయారని తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన సంచలనాలపై ది న్యూయార్క్‌ టైమ్స్‌ తాజా కథనం ప్రచురించింది. బంగ్లాదేశ్‌ ప్రధానిగా 2009లో షేక్‌ హసీనా అధికారం చేపట్టిన తర్వాత.. ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై అణచివేత మొదలుపెట్టారని ఆ స్టోరీలో ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినా, నిరసనలో భాగంగా రోడ్లను నిర్బంధించినా.. ఆందోళనకారులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకునేవని తెలిపింది. వీరిని ఎటువంటి విచారణ లేకుండా రహస్య జైళ్లలో ఉంచేవారని వెల్లడించింది. 2009 నుంచి దాదాపు 700 మంది అదృశ్యమైనట్లు మానవ హక్కుల సంఘాల అంచనా. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.

ఆయినా ఘర్ అంటే?

బంగ్లాదేశ్‌ సైన్యం భూగర్భంలో అనేక రహస్య నిర్బంధ కేంద్రాలను నిర్మించింది. వీటినే ‘ఐయినా ఘర్‌’గా పిలుస్తారు. ఇందులో ఉండే ఖైదీలు తమను కాకుండా మరో వ్యక్తిని చూడలేరు. అందుకే వాటిని ‘హౌస్‌ ఆఫ్ మిర్రర్‌’గా పరిగణిస్తారు. వాటికి విండోస్ కూడ ఉంటవు. చేతికి ఎప్పుడూ సంకెళఅలు ఉంటయి. వరుసగా గదులు ఉన్నప్పటికీ.. ఒకరినొకరు చూసుకునే వీలుండదు. ఓ మూలకు టాయిలెట్లు ఉంటాయి. ప్రతి సెల్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ మాత్రం ఉంటుంది. బయట ప్రపంచానికి సంబంధించి ఏ విషయం కూడా వాళ్లకు తెలియదు. వీటి నిర్వహణ అంతా సైన్యం చేతిలోనే ఉంటుంది. ఖైదీలను మానసికంగా హింసించడమే ఆ జైళ్ల ఉద్దేశం అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఖైదీలకు తరచూ మెడికల్ టెస్టులు కూడా చేస్తారని పేర్కొంది. అయితే, ఈ రహస్య జైళ్లకు సంబంధించిన అనేక మంది ఖైదీలు బయటకు చెప్పినప్పటికీ.. అవి ఉన్న ప్రాంతం గురించి ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు.

Advertisement

Next Story

Most Viewed