హిండెన్‌బర్గ్ సంచలన ట్వీట్.. త్వరలో మరో పెద్ద నివేదిక

by Mahesh |   ( Updated:2023-03-23 06:34:47.0  )
హిండెన్‌బర్గ్ సంచలన ట్వీట్.. త్వరలో మరో పెద్ద నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న హిండెన్ బర్గ్ (US షార్ట్ సెల్లర్) మరోసారి సంచలన ట్వీట్ చేసింది. త్వరలో మరో పెద్ద నివేదికను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో ఇది బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను విడుదల చేసింది. జనవరి 24న నివేదిక విడుదల కాగా.. నాటి నుంచి కేవలం ఐదు వారాల్లో అధాని కి చెందిన 12 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది. దీంతో మళ్లీ హిండెన్ బర్గ్ త్వరలో మరో పెద్ద నివేదిక అని పెట్టడంతో మార్కెట్ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు కుదేలయ్యే అవకాశం ఉందని.. వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story