High Salary countries | ప్రపంచంలో అత్యధిక జీతాలు ఏ దేశంలో లభిస్తాయో తెలుసా?

by S Gopi |
High Salary countries | ప్రపంచంలో అత్యధిక జీతాలు ఏ దేశంలో లభిస్తాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగులు ఎక్కువ జీతం కోసం అతిత్వరగా కంపెనీలు మారుతున్న ఈ కాలంలో.. ఏ దేశంలో ఎక్కువ జీతాలు లభిస్తాయో అక్కడికి వెళ్లి పనిచేయాలని ప్రతిఒక్కరూ ఆశపడతారు. అలా తమ నైపుణ్యాలకు మరో దేశంలో ఎన్నో రెట్లు జీతం కోసం వెళ్లే దేశాలలో అందరూ ఎక్కువగా వెళ్లేది అమెరికా దేశానికి. కానీ అంతకంటే మరెన్నో రెట్లు జీతాలు చెల్లించే దేశాలు ఉన్నాయి.

వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం.. అత్యధిక జీతం పొందే టాప్ 10 దేశాలు

నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జీతాలు ఆఫర్‌ చేస్తున్న టాప్‌-10 దేశాలు.. 1. స్విట్జర్లాండ్, 2. లక్సెంబర్గ్, 3. సింగపూర్, 4. అమెరికా, 5. ఐస్‌లాండ్, 6. ఖతార్, 7. డెన్మార్క్, 8. యూఏఈ, 9. నెదర్లాండ్స్, 10. ఆస్ట్రేలియా.

ప్రపంచ పెత్తనం కోసం అమెరికాకు సవాళ్లు విసిరే చైనా, రష్యా దేశాలు ఈ టాప్ టెన్ నివేదికలో లేకపోవడం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం భారతీయుల సగటు నెల జీతం 50 వేల రూపాయల లోపే ఉంది. ఈ జాబితాలో భారతదేశం 65వ స్థానంలో ఉండగా, పొరుగు దేశం పాకిస్థాన్ 104వ స్థానంలో ఉంది. డ్రాగన్‌ కంట్రీ చైనా స్థానం మాత్రం 44వ స్థానంలో భారత కంటే ముందంజలో ఉంది.

టాప్‌-1లో ఉన్న స్విట్జర్లాండ్‌లో వచ్చే సగటు జీతం, భారత్‌లో లభించే సగటు జీతం కంటే 10 రెట్లు పైగా ఎక్కువ.

వీళ్లకు రూ. 4 లక్షలకు పైగా నెల జీతం

ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లోని పౌరులు అత్యధిక జీతం పొందుతున్నారు, వాళ్ల సగటు నెలసరి జీతం రూ. 4 లక్షల కంటే ఎక్కువ. స్విట్జర్లాండ్‌లో ఉద్యోగుల సగటు నెల జీతం రూ. 4,98,567 కాగా, లక్సెంబర్గ్‌ సగటున నెలవారీ జీతం రూ. 4,10,156గా ఉంది. సింగపూర్ వాసులు నెలకు సగటును రూ. 4,08,030 పొందుతున్నారు.


వివిధ దేశాల్లో నెలవారీ సగటు జీతాలు:


  1. స్విట్జర్లాండ్: $6,096 (రూ. 4,98,567)
  2. లక్సెంబర్గ్: $5,015 (రూ. 4,10,156)
  3. సింగపూర్: $4,989 (రూ. 4,08,030)
  4. USA: $4,245 (రూ. 3,47,181)
  5. ఐస్‌లాండ్: $4,007 (రూ. 3,27,716)
  6. ఖతార్: $3,982 (రూ. 3,25,671)
  7. డెన్మార్క్: $3,538 (రూ. 2,89,358)
  8. UAE: $3,498 (రూ. 2,86,087)
  9. నెదర్లాండ్స్: $3,494 (రూ. 2,85,756)
  10. ఆస్ట్రేలియా: $3,391 (రూ. 2,77,332)
  11. నార్వే: $3,289 (రూ. 2,68,990)
  12. జర్మనీ: $3,054 (రూ. 2,49,771)
  13. కెనడా: $2,997 (రూ. 2,45,109)
  14. UK: $2,924 (రూ. 2,39,139)
  15. ఫిన్లాండ్: $2,860 (రూ. 2,33,905)
  16. ఆస్ట్రియా: $2,724 (రూ. 2,22,782)
  17. స్వీడన్: $2,721 (రూ. 2,22,534)
  18. ఫ్రాన్స్: $2,542 (రూ. 2,07,894)
  19. జపాన్: $2,427 (రూ. 1,98,489)
  20. దక్షిణ కొరియా: $2,243 (రూ. 1,83,441)
  21. సౌదీ అరేబియా: $2,002 (రూ. 1,63,731)
  22. స్పెయిన్: $1,940 (రూ. 1,58,660)
  23. ఇటలీ: $1,728 (రూ. 1,41,322)
  24. దక్షిణాఫ్రికా: $1,221 (రూ. 99,857)
  25. చైనా: $1,069 (రూ. 87,426)
  26. గ్రీస్: $914 (రూ. 74,749)
  27. మెక్సికో: $708 (రూ. 57,902)
  28. రష్యా: $645 (రూ. 52,750)
  29. భారతదేశం: $573 (రూ. 46,861)
  30. టర్కీ: $486 (రూ. 39,746)
  31. బ్రెజిల్: $418 (రూ. 34,185)
  32. అర్జెంటీనా: $415 (రూ. 33,939)
  33. ఇండోనేషియా: $339 (రూ. 27,724)
  34. కొలంబియా: $302 (రూ. 24,698)
  35. బంగ్లాదేశ్: $255 (రూ. 20,854)
  36. వెనిజులా: $179 (రూ. 14,639)
  37. నైజీరియా: $160 (రూ. 13,085)
  38. ఈజిప్ట్: $145 (రూ. 11,858)
  39. పాకిస్థాన్: $145 (రూ. 11,858)


Advertisement

Next Story