భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్

by Gantepaka Srikanth |
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో హింస, ప్రధాని షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్(BSF) అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఆ దేశంతో భారత్ 4,096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు బంగ్లాను వీడిన హసీనా కుటుంబంతో సహా భారత్‌లో తలదాచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, రిజర్వేషన్లలో మార్పులతో రగులుకున్న చిచ్చు బంగ్లాదేశ్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఇవి కాస్తా ముదరడంతో దాదాపు 300 మందికి పైగా ప్రజలు, పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో సైనిక పాలన మొదలైంది.

Advertisement

Next Story