ఇజ్రాయెల్‌పైకి 62 రాకెట్ల వర్షం.. హిజ్బుల్లా మెరుపుదాడి

by Hajipasha |
ఇజ్రాయెల్‌పైకి 62 రాకెట్ల వర్షం.. హిజ్బుల్లా మెరుపుదాడి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ పొరుగుదేశం లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా చెప్పినంత పని చేసింది. ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్‌లోకి ఇజ్రాయెల్ యుద్ధ విమానం చొరబడి హమాస్ డిప్యూటీ లీడర్‌ షేక్ సాలెహ్ అల్ అరూరిని హతమార్చింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ఇటీవల ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం లెబనాన్ బార్డర్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపైకి 62 రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన పలు కమాండ్ కంట్రోల్ సెంటర్లు దెబ్బతిన్నాయి. అక్కడున్న కమ్యూనికేషన్ టవర్లు కూలిపోయాయి. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే హిజ్బుల్లా దాడిని ముందుగానే అంచనా వేసిన ఇజ్రాయెల్.. బార్డర్ ఏరియాలలోని లక్షలాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించింది. ఈ దాడిపై హిజ్బుల్లా ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఇది ఆరంభం మాత్రమేనని తెలిపింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Advertisement

Next Story