- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Helicopter Crash: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం..హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి,పలువురికి తీవ్ర గాయాలు
దిశ, వెబ్‌డెస్క్:మన పొరుగు దేశం పాకిస్తాన్(Pakistan)లో శనివారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది.ఆఫ్గనిస్తాన్(Afghanistan) సరిహద్దు ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు (Khyber Pakhtunkhwa Province) లోని ఉత్తర వజీరిస్తాన్(North Waziristan) లో హెలికాప్టర్ కుప్పకూలి(Helicopter Crash) ఆరుగురు మృతిచెందగా,మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.మారి పెట్రోలియం(Mari Petroleum) కంపెనీకి కంపెనీకి చెందిన చార్టర్డ్ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్ లో సాంకేతిక లోపంతో కూలిపోయిందని అధికారులు తెలిపారు. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలింది. మరణించిన వారిలో ముగ్గురు రష్యా జాతీయులు, ఇద్దరు పైలట్లు, ఒక క్రూ మెంబర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.కాగా ఈ విషాద సంఘటనపై ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ గవర్నర్ ఫైసల్ కరీం(Faisal Karim) సంతాపం వ్యక్తం చేశారు.హెలికాప్టర్ ప్రమాదంపై నేవీ అధికారుల నుండి నివేదికను కోరారు.