యుద్ధం నుంచి విడుదల చేయాలి..రష్యా సైన్యంలోని ఓ భారతీయుడి ఆవేదన

by vinod kumar |
యుద్ధం నుంచి విడుదల చేయాలి..రష్యా సైన్యంలోని ఓ భారతీయుడి ఆవేదన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సైన్యం కోసం పనిచేస్తున్న ఓ భారతీయుడు ఇండియన్స్ అందరినీ త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన 47 ఏళ్ల ఉర్గెన్ తమాంగ్ అనే వ్యక్తి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన బృందంలోని 15 మంది రష్యేతరుల్లో 13 మంది మరణించారని ఇద్దరం మాత్రమే బతికి ఉన్నామని తెలిపారు. ‘నేను ఈ ఏడాది మార్చి నుండి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నా. ఇక్కడ అనేక ప్రాణనష్టం జరిగింది. మా గ్రూపులో రష్యాకు చెందని వారు 15 మంది ఉండేది. కానీ వారిలో 13 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ గ్రూపులో నేను, శ్రీలంకకు చెందిన మరో వ్యక్తి మాత్రమే బతికి ఉన్నాం’ అని తెలిపారు. రష్యాలో భద్రతా సిబ్బంది ఉద్యోగం ఇప్పిస్తానని తన ఏజెంట్లు నమ్మించారని, ఇక్కడకు వచ్చిన తర్వాత ఉక్రెయిన్‌పై యుద్ధానికి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ జరిపిన సమావేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని చెప్పారు. కాబట్టి రష్యా సైన్యంలోని భారతీయుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేసేలా చూడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed