Hamza bin Laden:ఒసామా బిన్ లాడెన్ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు..అల్‌ఖైదా నాయకత్వంతో దాడులకు ప్లాన్..!

by Maddikunta Saikiran |
Hamza bin Laden:ఒసామా బిన్ లాడెన్ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు..అల్‌ఖైదా నాయకత్వంతో దాడులకు ప్లాన్..!
X

దిశ, వెబ్‌డెస్క్:అల్‌ఖైదా(Al Qaeda) చీఫ్, 9/11 దాడుల సూత్రధారి, ఒసామా బిన్ లాడెన్ (Osama bin Laden) కొడుకు హంజా బిన్ లాడెన్(Hamza bin Laden) ఇంకా సజీవంగానే ఉన్నాడని,అతను ఓ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. కాగా 2019లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో హంజా హతమయినట్లు తొలుత వార్తలు వచ్చాయి.అయితే హంజా బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడని, తన సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్‌(Abdullah bin Laden)తో కలిసి ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లోని అబ్దుల్లా ఖేల్ (Abdullah Khel) అనే ప్రాంతంలో ఉన్నాడని 'ది మిర్రర్'(The Mirror) సంచలన కథనాన్ని ప్రచురించింది.అతను ఆఫ్ఘనిస్తాన్లో రహస్యంగా అల్‌ఖైదాను నడుపుతున్నాడని,తన తండ్రి బిన్ లాడెన్‌ను చంపిన పాశ్చాత్య దేశాలపై భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతునట్లు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలిసిందని పేర్కొంది.

హంజా బిన్ లాడెన్ ఎవరు..?

హంజా బిన్ లాడెన్..ఒసామా బిన్ లాడెన్ 20 మంది పిల్లలలో 15వవాడు. బిన్ లాడెన్ మూడవ భార్య కుమారుడు.ఇతడిని ముద్దుగా “జిహాద్ క్రౌన్ ప్రిన్స్” అని పిలుస్తారు.హంజా చిన్నప్పటి నుంచి తన తండ్రి అడుగుజాడల్లో నడిచాడు.ఓ ప్రముఖ పత్రిక నివేదిక ప్రకారం..హంజా 9/11 దాడులకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో తన తండ్రితో కలిసి ఉన్నాడు. ఆయుధాలను ఎలా వాడాలో నేర్చుకున్నాడు. చాలావరకూ ఉగ్రవాద క్యాంపెయిన్ వీడియోలలో కనిపించాడు.కాగా హంజా తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లోని ఓ కాంపౌండ్‌లో అమెరికా భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.బిన్ లాడెన్‌ 2001లో సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్ పై జరిగిన దాడులకు ప్రధాన సూత్రధారి.ఈ దాడిలో దాదాపు 3,000 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed