Johnny Master: పరారీలో జానీ మాస్టర్‌..! ఆచూకీ కోసం నార్సింగి పోలీసుల స్కెచ్

by Shiva |
Johnny Master: పరారీలో జానీ మాస్టర్‌..! ఆచూకీ కోసం నార్సింగి పోలీసుల స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా డాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ (Rayadurgam Police Station)లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో ఇతర నగరాల్లో అవుట్‌డోర్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో, అదేవిధంగా నార్సింగిలోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR)ను నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బాధితురాలి పూర్తి స్టేట్‌మెంట్ ఇప్పటికే రికార్డు చేశారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, ఆయన ప్రస్తుతం నెల్లూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నార్సింగి పోలీసు(Narsingi Police)లు నెల్లూరు పోలీసులను సంప్రదించి ఆయన ఆచూకీపై ఆరా తీసున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ ఆచూకీ లభ్యమైతే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Read More..

మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. సంచలన ఆరోపణలు చేసిన స్టార్ సింగర్.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్

Advertisement

Next Story

Most Viewed