Israel-Hezbollah: ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా ప్రతీకార దాడులు

by Shamantha N |   ( Updated:2024-10-07 05:41:07.0  )
Israel-Hezbollah: ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా ప్రతీకార దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరిగి ఏడాది పూర్తయ్యింది. అయితే, ఈ సమయంలో హమాస్‌, హెజ్‌బొల్లా (Hezbollah)పైనా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) తమ దాడులను మరింతగా పెంచింది. హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్‌ (Israel)పై మిసైల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరం, పోర్ట్‌ సిటీ అయిన హైఫాపై సోమవారం తెల్లవారుజామున.. హెజ్‌బొల్లా ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఐడీఎఫ్‌ సైనిక స్థావరం లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. ఆ దాడిలో ఓ మెయిన్‌ రోడ్డు, రెస్టరంట్, ఇల్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. హెజ్ బొల్లా దాడిలో పది మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.

లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లు

ఇకపోతే, లెబనాన్‌ (Lebanon) నుంచి రాత్రి వేళ 130కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. లెబనాన్ రాకెట్లను తాము అడ్డుకున్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. మరోవైపు, బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి 30కి పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది. అంతేకాకుండా, ఎప్పుడైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ (Iran) అప్రమత్తమైంది. దీంతో, విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఆదివారం రాత్రి 11 గంటల నుంచే షెడ్యూల్‌ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని టెహ్రాన్ పౌర విమానయాన సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story