US Elections: ట్రంప్ విధానాలపై విరుచుకుపడ్డ కమలా హ్యారిస్

by Shamantha N |
US Elections: ట్రంప్ విధానాలపై విరుచుకుపడ్డ కమలా హ్యారిస్
X

దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ విరుచుకు పడ్డారు. ట్రంప్ అనుసరిస్తానన్న విధానాలన్నీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని విమర్శించారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున కమలా నామినేషన్ అంగీకరించారు. ఆ తర్వాత ప్రసంగించారు. ఈ ఎన్నికలు దేశచరిత్రలో చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే.. ఇష్టారీతితన వ్యవహరిస్తారని మండిప్డడారు. ఆయన నిబద్ధతలేని వ్యక్తి అని.. ట్రంప్ ని వైట్ హౌజ్ లోకి పంపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. 2020 ఎన్నికల తర్వతా జరిగిన దాడులను గుర్తిచేశారు. క్యాపిటల్ హిల్ పైనే దాడి చేసేలా ట్రంప్ రెచ్చగొట్టారని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే ఘర్షణలను నిలువరించాలని కోరినా.. ఆయన మాత్రం వాటికి మరింత ఆజ్యం పోశారని పేర్కొన్నారు. తాను మాత్రం అలా చేయబోనని.. శాంతియుతంగా అధికార బదిలీకి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

వలస విధానంలో మార్పులు చేస్తా

అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానంలో మార్పులు చేస్తారని కమలా హ్యారిస్ అన్నారు. ఉక్రెయిన్‌ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. గాజాలో యుద్ధాన్ని ముగించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశాంతితో పోరాడాలని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలోనే అమెరికాను ఉన్నత స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. చైనాను పోటీలో లేకుండానే చేస్తామన్నారు. ప్రపంచ దేశాలకు అమెరికానే నాయకత్వం వహించేలా.. బలోపేతంగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

నామినేషన్ అంగీకరించిన కమలా

కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ, జాతి, లింగం లేదా మీ బామ్మ మాట్లాడే భాషతో సంబంధం లేకుండా అమెరికన్లందరి తరఫున అధ్యక్ష పదవికి నామినేషన్ అంగీకరిస్తున్నా” అని భావోద్వేగానికి లోనయ్యారు.డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున సమావేశానికి ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చప్పట్లు, స్టాండింగ్‌ ఒవేషన్‌లు, నినాదాలు, ప్లకార్డులతో ఆమెకు మద్దతుని ప్రకటించారు. అమెరికా భవిష్యత్ కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని ఆమె హామీ ఇచ్చారు. గతంలో ఎదుర్కొన్న విభజన, విద్వేషం వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ ఎన్నికలు ఓ అవకాశమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed