- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కావాల్సిన పరుగులు రెండు.. కోల్పోయిన వికెట్లు ఎనిమిది..!
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ (Domestic match)లో పరమ చెత్త రికార్డు నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా(Western Australia)కు టాస్మానియా జట్టు చుక్కలు చూపించింది. ఆష్టన్ టర్నర్, జోష్ ఇంగ్లిస్, జే రిచర్డ్‌సన్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు కలిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, టాస్మానియా(Tasmania) బౌలింగ్ దెబ్బకు కేవలం 53 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆర్కీ షార్ట్ (22) టాప్ స్కోరర్. అతడితో పాటు బాన్‌క్రాఫ్ట్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.
కాగా, ఒక దశలో 51/2తో పటిష్ట స్థితిలోనే ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియాను టాస్మానియా బౌలర్లు కేవలం 2 పరుగులలోపే మిగతా 8 మందిని ఔట్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ జట్టులో వరుసగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. టాస్మానియా బౌలర్ వెబ్‌స్టర్ కేవలం 17 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీయడం గమనార్హం. అతనికి స్టాన్‌లేక్ (3/12), టామ్ రోజెర్స్ (1/12) సైతం తమ వంతు సహకారం అందించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన టాస్మానియా 3 వికెట్లను కోల్పోయి 8.3 ఓవర్లలోనే వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచింది.