త్వరలోనే పెద్ద ప్రకటన చేయబోతున్నా : హార్దిక్ పాండ్యా

by saikumar |
త్వరలోనే పెద్ద ప్రకటన చేయబోతున్నా : హార్దిక్ పాండ్యా
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik pandya) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటాడు. తాజాగా అతడు పెట్టిన పోస్టు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.శుక్రవారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌(Instagram post) ఖాతాలో.. ‘నేను త్వర‌లోనే పెద్ద ప్రక‌ట‌న చేయ‌బోతున్నా.. కొంత స‌మ‌యం వేచి ఉంటే అదేంటో మీ అంద‌రికీ తెలుస్తుంది’ అని రాసుకొచ్చాడు. దాంతో, ‘అసలు పాండ్యా ఏం చెప్పనున్నాడు?’, ‘అత‌డి మ‌న‌సులో ఏం ఉంది?’ అని అభిమానులు తమకు తోచిన విధంగా చర్చించుకుంటున్నారు.

పాండ్యా చేయ‌బోతున్న ఆ కీల‌క ప్రక‌ట‌న ఏమై ఉంటుంది? అనే దాని గురించి డిస్కషన్ మొదలెట్టారు. ఇదిలాఉండగా, ఐపీఎల్ రిటెన్షన్‌కు గ‌డువు స‌మీపిస్తోంది. మ‌రో ఆరు రోజుల్లో వేలానికి వ‌చ్చేది ఎవ‌రో తేలిపోనుంది. అక్టోబ‌ర్ 31వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల‌ క‌ల్లా 10 ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల జాబితా వెలువ‌డ‌నుంది. కాగా, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ అట్టిపెట్టుకుంటుందా? వదులుకుంటుందా? అని జోరుగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. పాండ్యా వేరే జట్టుకు వెళ్లనున్నడా? ముంబై జట్టుతోనే కొనసాగుతాడా? తను చేస్తానన్న ప్రకటన దీని గురించేనా? అని జోరుగా చర్చ సాగుతోంది.

Advertisement

Next Story