నిద్రపట్టడం లేదు.. హెల్ప్ మీ! : శిఖర్ ధావన్

by saikumar |
నిద్రపట్టడం లేదు.. హెల్ప్ మీ! : శిఖర్ ధావన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్(Shikar Dawan) పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గురువారం రాత్రి 10.30 గంట‌ల‌కు సోషల్ మీడియా(Social Media post) ‘ఎక్స్’ వేదికగా.. ‘నిద్ర ప‌ట్టడం లేదు. సాయం చేయండి’ అనే రాసుకొచ్చాడు. దాంతో, అత‌డికి ఏమైంది? ఆరోగ్యం దెబ్బతిన్నదా? ఏమై ఉంటుంది? అని ఫ్యాన్స్‌ ఒకింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఆ పోస్టును గమనించిన వారంతా ధైర్యంగా ఉండు చాంపియ‌న్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉండగా, ఇటీవల భార్య అయేషా ముఖ‌ర్జీతో విడాకులు, కుమారుడు జొరావ‌ర్‌కు దూరంగా ఉండాల్సి రావ‌డం కార‌ణంగానే ధావ‌న్ మాన‌సికంగా స‌త‌మ‌తం అవుతున్నాడ‌ని కొంద‌రు అంటున్నారు. కొడుకును ధావన్ ఎంతో మిస్ అవుతున్నాడని అందుకే నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన శిఖ‌ర్ ధావ‌న్ తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మెరిశాడు.

Advertisement

Next Story

Most Viewed