GWTCS: ఘనంగా గ్రేటర్ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

by Maddikunta Saikiran |
GWTCS: ఘనంగా గ్రేటర్ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్:గ్రేటర్ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) స్వర్ణోత్సవ వేడుకలు(Golden Jubilee Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి.GWTCS ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్జీనియా(Virginia)లోని లీస్‌ బర్గ్‌(Leesburg)లో ఈ వేడుకలను నిర్వహించారు.రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural Events) అలరించాయి. ఈ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌(AP Assembly speaker) అయ్యన్నపాత్రుడు(Ayyana Patrudu) ముఖ్య అతిధి(Chief Guest)గా విచ్చేశారు.స్పీకర్ తో పాటు ఆయన సతీమణి పద్మావతి ఈ వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనడం మరిచిపోలేని అనుభవమని చెప్పారు. భారతదేశానికి ఎన్నారై(NRI)లు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అమెరికా(USA)లో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌(AP) సంక్షేమం కోసం వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారని, సహాయం చేయడంలో కూడా ముందుంటారని ప్రశంసించారు.GWTCS మరిన్ని వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు కృష్ణ లాంను, ఆయన టీమ్‌ను స్పీకర్ అభినందించారు.

GWTCS అధ్యక్షుడు కృష్ణ లాం(Krishna Lam) మాట్లాడుతూ.. సంస్థ ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను తన హయాంలో నిర్వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ వేడుక మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. GWTCS మొదటి నుంచి కమ్యూనిటీ అభివృద్ధినే లక్ష్యంగా ఎంచుకుని పనిచేస్తూ వస్తోందని,సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి వేడుకల్లో ప్రముఖ కళాకారులను పిలిపించి వారిచేత కార్యక్రమాలను నిర్వహించి కమ్యూనిటీని ఆకట్టుకుంటున్నామన్నారు. అలాగే పిక్నిక్‌, యోగ, లైవ్‌ బ్యాండ్‌ మ్యూజిక్‌ కార్యక్రమాలతో GWTCS మంచి పేరును తెచ్చుకుందన్నారు.ఈ వేడుకల్లో సినీ నటులు ఆలీ(Ali), శర్వానంద్‌(Sharvanand), అంజలి(Anjali)లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తానా(TANA) నాయకులు, ఎన్నారై టీడిపి నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.డా. మూల్పూరి వెంకటరావు, సత్యనారాయణ మన్నె, సాయిసుధ పాలడుగు, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్‌, వేమన సతీష్‌, ప్రదీప్‌ గౌర్నేని, ఇసి కమిటీ సభ్యులు, బోర్డ్‌ డైరెక్టర్లు, కమిటీ చైర్‌ పర్సన్‌లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Advertisement

Next Story

Most Viewed