Green Card: గ్రీన్‌కార్డు దారులకు అమెరికా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..కార్డుల వ్యాలిడిటీ పొడిగిస్తూ నిర్ణయం

by Maddikunta Saikiran |
Green Card: గ్రీన్‌కార్డు దారులకు అమెరికా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..కార్డుల వ్యాలిడిటీ పొడిగిస్తూ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్:అమెరికా(USA)లో శాశ్వత నివాసం(Permanent Residence) పొందుతున్న పౌరులకు(Citizens) అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.గ్రీన్‌ కార్డులు(Green Card) లేదా పర్మినెంట్‌ రెసిడెంట్‌(Permanent Resident) కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ఈ కార్డుల కాల వ్యాలిడిటీ ముగిసిన తర్వాత కూడా మరో 24 నెలలు పొడిగించేవారు.తాజాగా ఇప్పుడు దానిని 36 నెలలకు పెంచుతున్నట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) ప్రకటించింది.దీంతో గ్రీన్‌కార్డు రెన్యువల్‌(Green Card Renewal) కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో ఉరటనిచ్చే విషయమని చెప్పాలి. ఈ నిర్ణయం ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 నుంచి అమలులోకి వస్తున్నట్టు తెలిపింది.కాగా గ్రీన్‌కార్డుల రెన్యువల్‌కు ఏడు నుంచి 12 నెలల సమయం పడుతుంది. దాంతో అది వచ్చేవరకు పౌరులకు టెన్షన్‌ తప్పేది కాదు. ఈ ఎదురుచూపులకు అడ్డుకట్ట వేయడానికే గడువును 36 నెలలు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed