Gautam Adani: అదానీకి బిగ్ షాకిచ్చిన కెన్యా హైకోర్టు..!

by Maddikunta Saikiran |
Gautam Adani: అదానీకి బిగ్ షాకిచ్చిన కెన్యా హైకోర్టు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన, భారతదేశాని(India)కి చెందిన గౌతమ్ అదానీ(Gautam Adani)కి బిగ్ షాక్ తగిలింది.కొన్ని నెలల క్రితం కెన్యా(Kenya) ప్రభుత్వం ఆ దేశ రాజధాని నైరోబీ(Nairobi)లో ఉన్న జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ(Jomo Kenyatta International Airport) నిర్వహణను అదానీ గ్రూప్ కి 30 ఏళ్ల పాటు లీజుకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయాన్ని ఇండియాకు చెందిన అదానీ కొనుగోలు చేయడంపై అక్కడ పనిచేస్తున్న కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. ఈ డీల్‌ను కెన్యా ఏవియేషన్ వర్కర్స్ యూనియన్ వ్యతిరేకిస్తూ ఆ దేశ ఉన్నత కోర్టు లో కేసు వేసింది. తాజాగా కెన్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ కెన్యా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయం నిర్వహణ ప్రస్తుత యాజమాన్యం నుంచి అదానీ గ్రూప్‌కు బదిలీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కెన్యా హైకోర్టు పేర్కొంది.దీంతో అదానీ కి ఈ వార్త పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే.. జూలైలో కెన్యా ప్రభుత్వం జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ కి 30 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.వాస్తవానికి ఈ డీల్ విలువ 1.85 బిలియన్ డాలర్లుగా ఉంది.కెన్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కెన్యా ఏవియేషన్ వర్కర్స్ యూనియన్ కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు.నిరసనలు తారాస్థాయికి చేరడంతో దీన్ని విచారణ చేసిన కెన్యా హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. అదానీ సంస్థ ఈ విమానాశ్రయం నిర్వహణ తీసుకుంటే స్థానికంగా ఉద్యోగాలు కోల్పోతామని, ముఖ్యంగా భారతీయులకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కార్మికులు వారం రోజుల పాటు స్ట్రైక్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి వెంటనే విమానాశ్రయం నిర్వహణకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.

అయితే అదానీ గ్రూప్‌తో కుదిరిన ఒప్పందం ఎయిర్‌పోర్ట్ అమ్మకం కోసం కాదని.. కేవలం సౌకర్యాలు మెరుగు చేయడం కోసమేనని కెన్యా ప్రభుత్వం కార్మికులకు వెల్లడించింది. దీని కింద అదానీ కంపెనీ రన్‌వే, కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌ను నిర్మిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం అదానీ గ్రూప్ భారతదేశంలో ఉన్న టాప్-10 విమానాశ్రయాల్లో ఎక్కువ ఎయిర్ పోర్ట్ నిర్వహన బాధ్యతలు చూసుకుంటోంది.

Advertisement

Next Story