సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

by Y. Venkata Narasimha Reddy |
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయన వెంట తదుపరి సీఎం.. అప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిశీ, ఇతర మంత్రులు ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించాక.. త్వరలోనే అతిశీ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవల తిహార్ జైలు నుంచి విడుదలైన ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయతీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఆ పదవిని చేపట్టబోనని, మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని కేజ్రీవాల్ ప్రతినబూనారు.

Advertisement

Next Story

Most Viewed