ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి వ్యక్తి మృతి..

by Kavitha |
ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి వ్యక్తి మృతి..
X

దిశ కోటగిరి: మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఉదయం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు.. పంట కాలువలో పడి ఉన్న వ్యక్తి మ‌ృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత బాన్సువాడకు చెందిన సాయిరాం అనే వ్యక్తి తన భార్య విజయ తల్లి గారి ఇల్లు అయిన ఎత్తోండ గ్రామానికి వెళ్లడంతో భార్య దగ్గరకు వెళ్లడం కోసం బుధవారం రాత్రి మద్యం త్రాగి ఎత్తోండ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి ఊపిరాడక చనిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు.

Advertisement

Next Story