ఫ్రాన్స్ పశ్చిమ కూటమిలోనే కొనసాగాలి: నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్

by vinod kumar |
ఫ్రాన్స్ పశ్చిమ కూటమిలోనే కొనసాగాలి: నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే ఎన్నికల తర్వాత మితవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, ఫ్రాన్స్ పాశ్చాత్య సైనిక కూటమిలో కీలక సభ్యునిగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. గురువారం బ్రెస్సెల్స్‌లో నిర్వహించిన నాటో రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఎన్నికైన వివిధ పార్టీలు, పార్లమెంట్లలో మెజారిటీతో సంబంధం లేకుండా నాటో మిత్రదేశాలు కూటమికి కట్టుబడి ఉన్నాయి. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గ్రహించాం. ఎందుకంటే ప్రతి మిత్రపక్షం భద్రతా ప్రయోజనాల్లో ఉంది’ అని తెలిపారు. కాబట్టి భవిష్యత్‌లోనూ ఫ్రాన్స్ నాటోకు కీలకమైన సభ్యదేశంగా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి మెరైన్ లే పెన్ నేతృత్వంలోని పార్టీ నాటో రష్యా వైఖరిపై అస్పష్టంగా ఉందని, నాటో నుంచి వైదొలగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే స్టోలెన్ బర్గ్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed