మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..రతన్‌ టాటా పేరుతో ఇండస్ట్రియల్ అవార్డుల ప్రదానం

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-11 05:28:10.0  )
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..రతన్‌ టాటా పేరుతో ఇండస్ట్రియల్ అవార్డుల ప్రదానం
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ అధినేత(Tata Sons Head) రతన్ టాటా(Ratan Tata) రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబై(Mumbai)లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి(Breach Candy Hospital)లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government)కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో విశేష కృషి చేస్తున్న వారికి రతన్‌టాటా స్మార్థకార్థం ప్రభుత్వం తరుపున ‘రతన్‌ టాటా ఉద్యోగ రత్న అవార్డు(Ratan Tata Udyoga Ratna Award)’ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌(Industries Minister Uday Samant) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ముంబైలోని ఉద్యోగ్ భవన్(Udyog Bhavan) పేరును 'రతన్ టాటా ఉద్యోగ్ భవన్(Ratan Tata Udyog Bhavan)'గా మారుస్తున్నట్లు తెలిపారు. ఇక రతన్‌టాటాకు భారత రత్న అవార్డు(Bharat Ratna Award) ప్రదానం చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర కేబినెట్‌ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story

Most Viewed