- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ బస్టర్ హిట్ ‘వెంకీ’ సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల(Srinu Vaitla) బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పటికీ కొన్ని సినిమాలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఆయన గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మళ్లీ గోపిచంద్ ‘విశ్వం’(Gopichand) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను వైట్ల(Srinu Vaitla) తాను తెరకెక్కించిన సూపర్ హిట్ వెంకీ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘వెంకీ(venky) లాంటి వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాను.
సెకండాఫ్‌లో క్రైమ్ కామెడీతో పాటు చిన్న సస్పెన్స్‌కు కూడా పెట్టాలనుకుంటున్నా. కానీ వినోదాన్ని మాత్రం డబుల్‌డోస్‌లో జోడిస్తా. ఫస్టాఫ్‌ను మించిన కామెడీ సెకండాఫ్‌లో ఉంటుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని ఎంజాయ్ చేసే విధంగా సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నాను. వెంకీ కథ నుచి ప్రేరణ పొంది సీక్వెల్‌కు స్టోరీ రానుకున్నా. ఇది వెంకీ (venky)కంటే పది రెట్లు మించిన కథ’’ అని చెప్పుకొచ్చారు. అయితే వెంకీ సీక్వెల్ స్టోరీ గురించి రవితేజ(Ravi Teja)కు కూడా చెప్పినట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొందరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు టాక్.