Vaarahi Silks: వారాహి సిల్క్స్‌ స్టోర్ ఓపెనింగ్.. సందడి చేసిన సినీ నటులు బాలకృష్ణ , మీనాక్షి చౌదరి

by Maddikunta Saikiran |
Vaarahi Silks: వారాహి సిల్క్స్‌ స్టోర్ ఓపెనింగ్.. సందడి చేసిన సినీ నటులు బాలకృష్ణ , మీనాక్షి చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్:హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36(Jubilee Hills Road No 36)లో వారాహి సిల్క్స్‌(Vaarahi Silks) తమ కొత్త షోరూంను ప్రారంభించింది. ఈ స్టోర్ ను టాలీవుడ్‌ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary), వారాహి సిల్క్స్‌ నిర్వాహకులు యేచూరి మణిదీప్‌(Yechury Manideep), డా.స్పందన మద్దుల(Spandana Maddula) చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త పట్టు వస్త్రాలను(Silk cloths) అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో సరికొత్త సిల్క్స్‌ షోరూంను ఏర్పాటు చేశామని, స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రూ.25 వేల కొనుగోలుపై అరగ్రాము గోల్డ్‌ కాయిన్‌, రూ. 50 వేల కొనుగోలు మీద ఒక గ్రాము గోల్డ్, రూ. 1 లక్ష కొనుగోలుపై 2 గ్రాముల గోల్డ్ కాయిన్‌ అందిస్తామని పేర్కొన్నారు . దీంతోపాటు రూ.50 వేలకు పైన కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి లక్కీ డ్రాలో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తామని, లక్కీ డ్రాలో ముగ్గురు విన్నర్లను సెలెక్ట్ చేసి వారికి రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను గెలుచుకునే ఛాన్స్ కల్పిస్తామని తెలిపారు. ఈ స్పెషల్ ఆఫర్లు ఈ నెల 30 వరకు మాత్రమే అమలులో ఉంటాయని, కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed