- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో మిల్టన్ తుపాన్ బీభత్సంతో 16మంది మృతి
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని ఫ్లోరిడాలో మిల్టన్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన పెను గాలులు ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో నివాస ప్రాంతాలు జలమయం అయ్యాయి. తూర్పు తీరంలోని సెయింట్ లూసీ ప్రాంతంలో ఈ పెను తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు. చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. దాదాపు 31 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు దొరకడం లేదు.సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఫ్లోరిడా అంతటా ఈ పెను తుపాను ప్రభావం చూపింది. పెను గాలుల కారణంగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. గాలికి కిటికీలు కొట్టుకుపోయాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించే సిబ్బంది బస చేస్తున్న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒక స్టేడియం పైకప్పు ఎగిరిపోయింది. ఫ్లోరిడాలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో చిక్కుకున్న 400 మందిని అధికారులు రక్షించారు. ఆ అపార్ట్మెంట్లో 2 వేల మంది నివసిస్తున్నారు. రెండో అంతస్తు బాల్కనీ వరకూ నీళ్లు వచ్చాయి. రెండు వారాల కిందట వచ్చిన హెలీన్ తుపాను మిగిల్చిన భయంకర నష్టం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఫ్లోరిడాపై ఇప్పుడు మిల్టన్ తుపాను విరుచుకుపడింది. మెక్సికో గల్ఫ్ ప్రాంతంలో తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అలలు దాదాపు 35 అడుగుల ఎత్తుకు ఎగిశాయని స్థానికుల కథనం.